జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా దేవర. అయితే ఈ దేవర సినిమా రిలీజ్ కోసం చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే తాజాగా దేవర సినిమాను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఎన్నో అంచనాల మధ్య దేవర సినిమా రిలీజ్ అయింది. శుక్రవారం ఉదయం ఒకటి గంటల నుంచి ప్రీమియర్ షోలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.

 కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా సినిమా రెండు భాగాలుగా తీశారు.  ఇక దేవర సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించగా హీరోయిన్గా జాన్వి కపూర్ బాలీవుడ్ నుంచి దిగిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వి కపూర్ కు ఇది మొదటి సినిమా. అంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందన్నమాట. దీంతో ఈ బ్యూటీపై చాలా అంచనాలే పెట్టుకున్నారు తెలుగు ఫ్యాన్స్.

అయితే భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజ్ అయిన దేవరా సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా అద్భుతంగా ఉందని చెబుతుంటే.. కొంతమంది సినీ విశ్లేషకులు... అంచనాలను అందుకునేలా దేవర సినిమా లేదని చెబుతున్నారు. ఒక్కొక్కరు తమ రివ్యూ ను రివిల్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమాను ఎడిట్ చేస్తే 30 నిమిషాలు మాత్రమే... అసలు సిసలు కథ ఉందని చెబుతున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు.

 రెండు గంటల 50 నిమిషాల పాటు కొరటాల శివ చేసిన సాహసం.. పెద్దగా సక్సెస్ కాలేదని కూడా అంటున్నారు. సోదంతా సినిమాలో నింపేసి... కథ మొత్తం 30 నిమిషాల్లో చెప్పాడని అభిప్రాయపడుతున్నారు. శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎడిటర్ ఎడిటర్ కూడా... ఎంత ఎడిటింగ్ చేసిన అందులో.. పసలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  సింపుల్గా చెప్పాలంటే దేవర మొత్తం 30 నిమిషాల్లోనే ఉందని  సినీ విశ్లేషకులు. మరి సినిమా జనాల్లోకి ఏ మేరకు ఎక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: