యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర . సెప్టెంబర్ 27 మిడ్ నైట్ 1:00 గంట నుంచే సినిమా షోస్ పడిపోయాయి. సినిమా చూసిన ఆడియన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఒకరైతే బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే, మరి ఒకరు ఆడియన్స్ ని పిచ్చోళ్ళ ని చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు ప్రీ రిలీజ్ జరగక పోవడమే బెటర్ అయ్యింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే , సినిమా విడుదలకు మూడు రోజుల ముందే హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. అంతే కాదు భారీ ఎత్తున ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలివచ్చారు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వి కపూర్ కూడా తెలుగులో మాట్లాడి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అందరి కష్టం వృధా అయిపోయింది. లెక్కకు మించి అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో భద్రత రీత్యా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.

ఇలా క్యాన్సిల్ అవ్వడమే మంచిదయ్యింది. లేకపోతే సినిమాపై ఇంకా హైప్ పెంచే వాళ్లేమో. ముఖ్యంగా సినిమాలో మ్యాటర్ లేకుండా హైప్ పెంచితే.. ఈ ఇంపాక్ట్ రిజల్ట్ మీద పడుతుందని కొరటాల శివ మర్చిపోయారేమో, అసలు జనాలను పిచ్చోళ్లను అనుకుంటున్నారేమో అంటూ పబ్లిక్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సినిమాలో కొన్ని భాగాలు అసలు కరెక్ట్ గా తెరకెక్కించుంటే ఏ సినిమా మరో లెవెల్ కి వెళ్ళుండేదని , ఒకవేళ ఎన్టీఆర్ కాకుండా ఇంకొకరి ఎవరైనా ఇందులో నటించి ఉంటే కచ్చితంగా డిజాస్టర్ అయ్యుండేదని కూడా కామెంట్ చేస్తున్నారు.  ఏది ఏమైనా ఎన్టీఆర్ తన భుజస్కందాల పైన ఈ సినిమాను నడిపించారు అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: