టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా హిందీ వర్షన్ రన్ టైమ్ ను మాత్రం కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క హిందీ వర్షన్ రన్ టైమ్ ను ఏడు నిమిషాల వరకు మూవీ యూనిట్ తగ్గించినట్లు తెలుస్తోంది.  అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో తెలుగు నటులతో వచ్చే సోలో సన్నివేశాలను హిందీ లో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు అనే ఉద్దేశంతో వాటిని కట్ చేసినట్లు దానితో ఈ సినిమా నిడివి హిందీ వర్షన్ లో ఏడు నిమిషాల వరకు తగ్గినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మొదటి నుండి కూడా దేవర యూనిట్ హిందీ ప్రేక్షకులను ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంది.

ఇక్కడ ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున చేసింది. మరి హిందీ ఏరియాలో ఈ సినిమాకు కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే భారీ స్థాయి కలెక్షన్లు ఈ ఏరియా నుండి ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి ఎలాంటి కలెక్షన్లు దక్కుతాయో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి హిందీ ఏరియాలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దానితో దేవర పార్ట్ 1 మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: