జూనియర్ ఎన్టీఆర్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్ ఉన్న హీరో. నందమూరి కుటుంబంలో ఏ హీరోకు లేని ఫ్యాన్ బేస్ జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉంది. ఆ కుటుంబం అతన్ని ఇష్టపడకపోయినా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టపడతారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా ఎంట్రీ ఇచ్చాడు. దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఇవాళ దిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.


జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో బాలీవుడ్ నటులు బాగానే నటించారు.  ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు జాన్వి రొమాన్స్ చేసింది.  ఆమె పాత్ర ఈ సినిమాలో తక్కువైనా కూడా క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది.  అటు బాలీవుడ్ నటుడు సైఫ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించారు.  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాను కొరటాల శివ అద్భుతంగా తీశారని సమాచారం.


ప్రస్తుతం టాక్ చూస్తుంటే... అదే స్పష్టం అవుతోంది. కానీ కొంతమంది దేవర మూవీ పెద్దగా నచ్చలేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ దేవర సినిమా రాజమౌళి సెంటిమెంటుకు బ్రేక్ వేసినట్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా జక్కన్న దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత... హీరోలకు సక్సెస్ ఉండడం లేదు. ఇప్పటికే నితిన్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, నాని, సునీల్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారితో జక్కన్న చాలా సినిమాలు చేశారు.

 వారితో మంచి విజయాలను కూడా అందుకున్నారు. కానీ జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఆయా హీరోలకు తర్వాతి సినిమాలో అట్టర్ ఫ్లాప్ సమస్యలు వచ్చాయి. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో.. అలా జరగలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఆర్ ఆర్  ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్.  అయితే ఈ దేవరా సినిమా మంచి హిట్ అందుతుందని ఈ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. రాజమౌళి సెంటిమెంటును బ్రేక్ చేశాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: