భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటికే అర్ధరాత్రి షో లు పడడంతో ఈ సినిమాలు చూసిన నందమూరి అభిమానులు కొంతమంది ఎన్టీఆర్ నటన కోసం సినిమాకు వెళ్లొచ్చు అంటే మరి కొంత మంది మాత్రం కొరటాల డైరెక్షన్ పై పెదవి విరుస్తున్నారు. దేవర సినిమాపై ఆచార్య మూవీ ఎఫెక్ట్ పడిందో ఏమో తెలియదు కానీ దేవర గురించి చాలామంది సినిమా చూసిన అభిమానులు కొరటాల చెప్పిన పని చేసి చూపించలేకపోయాడు. ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసుకోనేలా తిరుగుతారు అని చెప్పి తలదించుకునేలా చేశాడు అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ప్రేక్షకుల ముందు భారీ అంచనాలు అని హైప్ క్రియేట్ చేసి అంచనాలు అందుకోకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దేవర సినిమాని అనౌన్స్ చేశారు కొరటాల శివ.మొదటి నుండి ఈ సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ లుక్ జాన్వి కపూర్ లుక్ ఇందులో నుండి విడుదలైన పాటలు అన్నీ కూడా సినిమాపై భారీ హైప్ పెంచేశాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని తీరా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తే మాత్రం చాలామంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు. 

అయితే ఈ సినిమా చూసిన అభిమానులు నిరాశ చెందడానికి కొరటాల డైరెక్షనే కారణమని కొంతమంది అంటున్నారు.అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారు కాబట్టి ఆయన్ని అందరూ ఆ రేంజ్ లోనే చూస్తారు. కానీ సినిమా చూసిన జనాలు కొరటాల శివ ది 70, 80% తప్పు ఉందని అంటున్నారు. ఎందుకంటే..రాతా బాగోలేదు తీతా బాగాలేదు అంటూ తిడుతున్నారు. సినిమాలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపించలేదని, ఎలివేషన్స్ కూడా అంత బాగా లేవని అంటున్నారు. ఇక అలాగే సినిమాకి ముందు విడుదలైన పాటలన్నీ మంచి వ్యూస్ సంపాదించాయి.కానీ సినిమాలో పాటలకు కాస్త హైప్ కూడా ఉండేటట్లు చూసుకోలేదు.కథ లేదు కథనం మీద ఎలాంటి కసరత్తు లేదు ఎన్టీఆర్ కి తగ్గ డైలాగులు కూడా లేవు.

దర్శకుడిగా కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు.మంచి పాటల ఆల్బమ్ కూడా కొరటాల శివ తీసుకోలేకపోయాడు అంటూ సినిమా చూసిన జనాలు కొరటాల శివ పై ఫైర్ అవుతున్నారు.ఇక ఎన్టీఆర్ కూడా కాస్త మిస్టేక్ చేసినట్టు అభిమానులు అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో మూవీ చేశారు కాబట్టి ఆయన్ని ఆ రెంజ్ లోనే చూస్తారు.ఇక పాన్ ఇండియా కథ అని చెప్పారు కానీ కథా కథనం బాగుందా లేదా అని ఎన్టీఆర్ చూసుకోలేకపోయారు. అలాగే ఆ స్టోరీని అసలు రెండు పార్ట్ లుగా తీయవచ్చా లేదా అని కూడా ఆలోచించ లేకపోయారు అంటూ సినిమా చూసిన జనాలు ఎన్టీఆర్ ను కూడా నిందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: