ఇప్పటివరకు టాప్ హీరోల వారసులు హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పరిస్థితులు కొనసాగాయి. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయానికి రవితేజా కొడుకు మహాధన్ మార్చబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజా నటించిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో మహాధన్ నటించడంతో అతడు ఏదో ఒకరోజు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అనుకున్నారు అంతా.



అయితే ప్రస్తుతం అతడు సందీప్ వంగా దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేయబోతున్నట్లు తలుస్తోంది. త్వరలో సందీప్ వంగా దర్శకత్వం వహించే మూవీకి సహాయ దర్శకుల టీమ్ లో మహాధన్ ఉంటాడని అంటున్నారు. వాస్తవానికి గతంలో రవితేజా హీరో అవ్వకముందు సహాయ దర్శకుడుగా పనిచేస్తూ ఉండేవాడు.



దర్శకుడు కృష్ణవంశీ మాస్ మహారాజ టాలెంట్ ను గుర్తించి అతడు హీరో అవ్వడానికి ప్రోత్సహించిన విషయం తెలిసిందే. దీనితో ప్రస్తుతానికి సందీప్ వంగా దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేసినప్పటికీ రానున్నరోజులలో మహాధన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయం రానున్నరోజులు తెలియచేస్తాయి. తమిళ టాప్ హీరో విజయ్ కొడుకు కూడ దర్శకుడుగా మారాలని దర్శకత్వ శాఖలో శిక్షణ పొందుతున్నట్లు గతంలో వార్తాలు వచ్చాయి.



పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ప్రస్తుతం సంగీత దర్శకుడుగా మారాలని ప్రయత్నిస్తూ కొన్ని వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా రవితేజా కూతురు కూడ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె నిర్మాతగా మారాలని ప్రయత్నిస్తున్నట్లు త్వరలోనే ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈమె ఒక చిన్న సినిమాను తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే రవితేజా వారసులు ఇద్దరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్లు భావించాలి. అయితే అభిమానులు మాత్రం మాస్ మహారాజా కొడుకు మహాధన్ రవితేజా వారసత్వాన్ని కొనసాగించాలని ఆశ పడుతున్నారు. అయితే అసలు విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి.. .  




మరింత సమాచారం తెలుసుకోండి: