సోలో హీరో గా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాలా కాలం అవుతుంది . ఎన్టీఆర్ ఆఖరు గా సోలో హీరో గా అరవింద సమేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది . ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా లో హీరో గా నటించిన ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు . తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరో గా దేవర పార్ట్ 1 మూవీ లో నటించాడు . ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా థియేటర్ల లో విడుదల అయింది.

సినిమా హిట్ టాక్ కోసం ఎదురు చూస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ,  హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకున్నట్లయితే ఎన్టీఆర్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మరింత పెరిగే అవకాశం ఉంది. అలా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగినట్లు అయితే వార్ 2 పై కూడా అంచనాలు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది.

అందుకోసం హృతిక్ రోషన్ కూడా ఈ సినిమా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: