ఈ సంవత్సరం కల్కి తర్వాత విడుదలైన బిగ్గెస్ట్ మూవీ "దేవర". ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై హైప్స్ వేరే రేంజ్ లో నెలకొన్నాయి. అలాగే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా సెకండ్ హాఫ్ లో వస్తుంది.
ఇక ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, వర అనే రెండు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. రెండు పాత్రలను చాలా భిన్నంగా, పర్ఫెక్ట్ గా పోషించి ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్ అని మరొకసారి నిరూపించుకున్నారు. దేవర మూవీలో ఎన్టీఆర్ నటనకు వంక పెట్టే అవకాశం లేదు. అంత బాగా నటించారు. ఆయన డ్యూయల్ షేడెడ్ రోల్సే ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. తారక్ 200% నటుడిగా న్యాయం చేశారు.
ఈ మూవీలో కార్గో షిప్పులను చోరీ చేసే దొంగలకు దేవర నాయకత్వం వహిస్తుంటాడు. ఓన్లీ పొట్ట నింపుకోవడానికి వారు ఈ దొంగతనాలు చేయాల్సి వస్తుంది. తర్వాత దేవర కార్గో షిప్స్ చోరీ చేయడం మానేసి క్రిమినల్స్ కి సహాయం చేయడం స్టార్ట్ చేస్తాడు. దీంతో దొంగలు అతనికి వ్యతిరేకమవుతారు. వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇలా ఒక పిరియాడికల్ డ్రామాగా సాగుతుంది. కానీ కథను ప్రజెంట్ చేసే విధానంలో డైరెక్టర్ పడటాల శివ ఫెయిల్ అయిపోయాడు. చాలా అనవసరమైన క్యారెక్టర్స్ పెట్టాడు. కథ రాయడం కూడా సరిగా రాయలేకపోయాడు. ఈ సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయింది. మొత్తం మీద ఈ సీన్ అద్భుతంగా ఉందని చెప్పడానికి దేవరలో ఒక్క సన్నివేశం కూడా లేదు.
ఇక చుట్టమల్లె సాంగ్ తప్ప మిగతా పాటలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అతడు తన మార్క్ చూపించారు. ఎన్టీఆర్, అనిరుధ్ ఇద్దరూ వందకు రెండొందల శాతం న్యాయం చేశారు. మరి, ఎందుకు అంచనాలు అందుకోలేదు? అంటే... ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏం జరుగుతుంది? అనేది వెండితెర ఆసక్తికరంగా చూపించలేకపోయాడు కొరటాల. దాదాపు మూడు గంటలు ప్రేక్షకుడిని థియేటర్లలో కూర్చోబెట్టేలా కొరటాల శివ రచన, దర్శకత్వం లేకపోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఎన్టీఆర్, అనిరుధ్ సంగీతం ఈ సినిమాలో లేకపోయి ఉంటే దేవర కచ్చితంగా డిజాస్టర్ అయ్యుండేది.