కాగా ఆరేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇక అభిమానులందరికీ కూడా ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టినంత కిక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అభిమానులు మాత్రం సినిమా చూశాక నిరాశ చెందుతున్నారు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వెళితే.. కనీసం అభిమానులు విజిల్స్ వేసి చప్పట్లు కొట్టే సీన్స్ కూడా దేవరాలు ఎక్కువగా లేవట. అయితే ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగానే పాత్రలకు ప్రాణం పోసి నటనతో ఇరగదీసాడు.
ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. కానీ కొరటాలే కథ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనే టాక్ ఏకంగా అభిమానుల నుంచి వస్తుందట. ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటే.. కొరటాల ఆ రేంజ్ సినిమా తీయలేకపోయారు అని కొంతమంది అభిమానులు పెదవి విరుస్తున్నారట. ఎన్నో ఆశలతో అటు థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుల కు దేవర సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది అన్నది తెలుస్తుంది. దీంతో ప్రీమియర్ షోలకు వెళ్లిన అభిమానులను.. సినిమా ఎలా ఉంది అని అడిగితే కనీసం ఏమి చెప్పకుండానే సైలెంట్ గా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందట.