యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసిన చిత్రం దేవర.. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇందులో మొదటి భాగం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసిన కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కావాలని దేవర సినిమా పైన కాస్త నెగిటివ్ తీసుకువచ్చేలా చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ని కూడా భారీగానే ప్లాన్ చేశారు. దీంతో కొంతమంది నేటిజన్స్ ఈవెంట్ పైన కామెంట్లు చేయడం జరిగింది.


దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కచ్చితంగా ఎన్టీఆర్ తోపాటు దేవర సినిమాకి సంబంధించిన నటీనటులు డైరెక్టర్ ఇలా అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి హైప్ ఎక్కించేవారు. ఈ విషయాలను అభిమానులు చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన పరిస్థితి చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడమే మంచిదయ్యిందని లేకపోతే ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూసి చెప్పిన మాటలను చూసి చాలామంది ట్రోల్ చేసేవారని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కచ్చితంగా ఎన్టీఆర్ ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా చాలా ఎమోషనల్ గా కాన్ఫిడెంట్ గానే మాట్లాడుతూ ఉండేవారు.. దేవర సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో కచ్చితంగా హైప్ ఎక్కించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తూ ఉన్నారు కనుక ఆయన కూడా ఈ సినిమాకి మరింత ఊపు తీసుకువచ్చేలా మాట్లాడేవారు. అలాగే కొరటాల శివ, జాన్వీ కపూర్ ఇలా అందరూ కూడా మాట్లాడేవారు.మొత్తానికైతే దేవర సినిమా విడుదలై అభిమానులను మెప్పించిన.. సినిమా చూసిన మరికొంతమంది నెటిజెన్స్ ని మెప్పించలేక పోయిందనీ  తెలియజేస్తున్నారు..ఏది ఏమైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి ఎన్టీఆర్ ని ట్రోల్ బారి నుంచి తప్పించిందనీ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: