జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమా దేవర. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రోజున అంటే ఇవాళ ఉదయమే రిలీజ్ అయింది. అర్ధరాత్రి ఒక్కటి గంటల సమయంలో ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు దేవరా సినిమాను ! అయితే దేవర సినిమాను చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత తమకు మంచి పండుగ వాతావరణాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారని చెబుతున్నారు.

 దసరా పండుగను 15 రోజుల ముందే జూనియర్ ఎన్టీఆర్ తమకు ఇచ్చారని కూడా కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే... జూనియర్ ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో దుమ్ము లేపాడట. డ్యూయల్ రోల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్... రెండు పాత్రల్లో అందరినీ కనువిందు చేశాడట. తండ్రిగా అలాగే కొడుకుగా రెండు పాత్రల్లో రెండు వేరియేషన్స్ చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడట.

ఈ సినిమాలో రియల్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని అందరూ అంటున్నారు.కొరటాల శివ దర్శకత్వం కాస్త అటు ఇటుగా అయినా కూడా... జూనియర్ ఎన్టీఆర్ మొత్తం దాన్ని సెట్ చేశాడని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రియల్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే...  ఈ సినిమాకు సెకండ్ హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని చెబుతున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందించకపోతే సినిమా మళ్లీ.. డల్ అయ్యేదని కొంతమంది వాదన.

 ఈ మూవీకి అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉందట. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా అందించాడట అనిరుద్. ఫైట్ సీన్స్ వచ్చిన... లేక ఎమోషన్స్ సీన్స్ వచ్చిన... హీరో ఎంట్రీ అప్పుడు కానీ... ఇలా డిఫరెంట్ షేర్స్ తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడట. అందుకే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే... ఆయన తర్వాత రియల్ హీరోగా అనిరుద్ అని చెబుతున్నారు కొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: