కొన్నెల్లా నిరీక్షణ తర్వాత అభిమాన హీరో సినిమా వస్తే థియేటర్ల వద్ద సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాలో హైప్ చేసే సీన్స్ అన్నిటికీ కూడా విజిల్స్ కొట్టాలని ఫాన్స్ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇక తమ విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు దేవర సినిమా విషయంలో కూడా అభిమానులు అలాగే అనుకున్నారు. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తారక్ సోలోగా నటిస్తున్న దేవర మూవీ ఇటీవల గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు రిలీజ్ అయింది. దీంతో ఇక అభిమానులు అందరూ కూడా థియేటర్లకు తరలి వెళ్లారు.


 ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేస్తున్న మూవీ కావడం.. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు ట్రైలర్ కు సోషల్ మీడియాలో భారీగా బజ్ ఏర్పడటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ పాటలే ఇలా ఉన్నాయంటే సినిమా ఊహకందని రీతిలో ఉంటుందని.. ఒక్కో సీన్స్ కి గూస్ బంప్స్ పక్కా అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ థియేటర్ వెళ్ళాక మాత్రం అందరూ నిరాశలో మునిగిపోయారు.


 ఎందుకంటే సినిమా థియేటర్ మొత్తం అనుకున్నట్లుగానే అభిమానులతో నిండిపోయింది. కొంతమంది అయితే సీట్లు దొరక్క నిలబడి కూడా సినిమా చూసారు. అంతా బాగానే ఉన్నా సినిమా మొత్తం కనీసం విజిల్స్ వేసే సీన్స్ రెండు మూడు కూడా లేవట. ఇక వీరాభిమానులకు సైతం గూస్ బంప్స్ తెప్పించే సీన్లు సినిమాలో కనిపించలేదట. దీంతో థియేటర్ మొత్తం ప్రేక్షకులతో నిండిన కనీసం కేరింతలు లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీంతో సినిమా చూసిన అభిమానులు అందరూ కూడా కొరటాల బుర్రలో గుజ్జు, పెన్నులో ఇంకు అన్నీ  అయిపోయాయి. అందుకే తారక్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీశాడు. గ్లోబల్ స్టార్ తారక్ క్రేజ్ ని కొరటాల వాడుకోలేకపోయాడు అంటూ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: