జాన్వి కపూర్ ఆ హీరో సరసన నటిస్తుంది ఈ హీరో సరసన నటిస్తుంది అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఇక తారక్ సినిమాలో ఫిక్స్ అయింది ఇది అఫీషియల్ గా మారిపోయింది. అయితే గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరెట్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కాంబో కావడంతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు అనుకున్నారు. అదే సమయంలో ఇప్పటివరకు విడుదలైన చుట్టమల్లే సాంగ్ ఇతర పాటల్లో జాన్వీని ఏకంగా అతిలోకసుందరిలా చూపించాడు కొరటాల. దీంతో ఈ హీరోయిన్ అభిమానులు అందరూ కూడా తెగ సంతోష పడిపోయారు..
కేవలం ట్రైలర్ పాటల లోనే జాన్విని ఇలా చూపించారంటే సినిమాలో ఇక దేవకన్యలా చూపించి ఉంటారని..ఆమె పాత్ర చూసి ఫిదా అవ్వచ్చు అని థియేటర్కు వెళ్లారు జాన్వి అభిమానులు. కానీ అందరికీ నిరాశ ఎదరంది. ఎందుకంటే అసలు నిజంగా దేవర సినిమాలో జాన్వి కపూర్ ఉందా అని అనుమానం అభిమానులకు కలిగింది. ఎందుకంటే సినిమా మొదలైన ఇంటర్వెల్ తర్వాత జాన్వి కపూర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సరే కాస్త ఆలస్యంగా వచ్చిన జాన్వి తెరపై చూడవచ్చు అనుకున్నారు అభిమానులు. కానీ మెరుపుతీగ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది జాన్వి పాత్ర. మొత్తంగా దేవర సినిమా పార్ట్ వన్ లో జాన్వి పాత్రకి కేవలం నాలుగైదు సీన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇదేం సినిమా రా బాబు జాన్విని చూద్దామని వస్తే.. కొరటాల ఇలా డిసప్పాయింట్ చేశాడు అని ఇక ఈ హీరోయిన్ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారట.