- కొరటాల మ్యాజిక్ పనిచేయలేదా..
- స్టోరీని డామినేట్ చేసిన ఎన్టీఆర్ యాక్టింగ్..
-డిసప్పాయింట్ అయిన నందమూరి ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన దేవర సినిమా అర్ధరాత్రి నుండి షో లు పడిపోయి సినిమాని చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. అయితే సినిమా చూసిన నందమూరి అభిమానులు అయితే కాస్త నిరాశతో సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. దేవర సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశారు. కానీ అందులో కథా కథనం ఏమీ లేదు అని నిరాశ పడుతున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో ఫెయిల్ అయిపోయారని అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించిన ఒక పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. నందమూరి అభిమానులు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో చాలామంది నిరాశ పడ్డారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టారు.. 


ప్రీ రిలీజ్ ఈవెంట్  క్యాన్సల్ అవ్వడంతో ఎన్టీఆర్ స్టేజ్ మీద ఇచ్చే ఎమోషనల్ స్పీచ్ మిస్ అయ్యాం.. అలాగే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టుగా చేసే సుమక్క కామెడీ ని కూడా మిస్ అయిపోయాం. ఇక దేవర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన అనిరుద్ లైవ్ కాన్సెర్ట్ ని కూడా మిస్ అయిపోయాం.. ఎందుకు మాకే ఇలా అవుతుంది.ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం కానీ మాకే ఎందుకు ఇలా జరగాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు  షేర్ చేసిన ఒక పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్స్ కూడా ఆరేళ్లుగా ఆకలితో ఉన్న నందమూరి అభిమానులకు కొరటాల శివ  కడుపు నింప లేకపోయారు అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా ఎలా ఉంది అనేది ఇంకో రెండు మూడు రోజులు దాటితే కానీ చెప్పలేం.ఎందుకంటే చాలా సినిమాలు మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయినవి ఉన్నాయి. మరి దేవర సినిమాలో కూడా ఆ మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: