ఇకపోతే దేవర సినిమా రిలీజ్ కి ముందే యూఎస్ మార్కెట్లో తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా తన విజయ పరంపరను కొనసాగిస్తున్నట్లు కనపడుతుంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు, అమెరికాలో... మరి ముఖ్యంగా, ఒక నార్త్ అమెరికాలోనే 2.7 మిలియన్ మార్క్ దాటి పోతున్నట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. దీంతో ఫస్ట్ డేనే త్రీ మిలియన్ మార్క్ ఈజీగా దాటిపోనుందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసినదే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా మంచి కిక్కిస్తోందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారని అంటున్నారు. హీరోయిన్ గా జాన్వికి పెద్దగా స్కోప్ లేదని, అయితే సైఫ్ అలీ ఖాన్ రోల్ మాత్రం అదిరిపోయిందని చెబుతున్నారు. మీరు ఒకవేళ సినిమాను చూసినట్లయితే, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి!