మాస్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సారధ్యంలో... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, శ్రీదేవి కూతురు జాన్వి హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మొదటి రోజు ఏ స్థాయి వసూళ్లను రాబడుతోంది అనే విషయం పైన ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు తొలి రోజు 150 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమా వసూళ్లను రాబట్ట వచ్చు అని గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో సినిమా అదిరిపోయింది అంటూ టాప్ రేటింగ్స్ ఇచ్చేస్తున్నాయి సదరు వెబ్సైట్లు.
ఇకపోతే దేవర సినిమా 80వ దశకానికి చెందిన కథగా తీర్చిదిద్దారు దర్శకులు. అప్పటి వేరియేషన్ సినిమాలో చాలా స్పష్టంగా కనబడుతోందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని సమాచారం. హీరోయిన్ జాన్వి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందని తెలుస్తోంది. ఇలా ప్రతి నాయకుడు పాత్రని పోషించిన సైఫ్ అలీ ఖాన్ దుమ్ము దులిపేశాడని చెప్పుకుంటున్నారు. సినిమా చూసిన వారు దాదాపుగా దేవర సినిమా ఇంతకు ముందు ఎన్టీఆర్ సినిమాల కంటే కూడా అద్భుతంగా ఆడుతుందని అంటున్నారు. ఒకవేళ మీరు సినిమాను ఆల్రెడీ చూసినట్లయితే, దేవర సినిమాకు మీరిచ్చే రేటింగ్ కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నిరంతర సమాచారం కోసం మా వెబ్సైట్ వీక్షించండి.