ఆయన ప్రతి సినిమాలో తనదైన మార్కు కనబరుస్తారు. అందుకే అతను నేడు దర్శక ధీరుడు అని పిలవబడుతున్నాడు. సినిమా టైటిల్ కార్డ్స్ నుండి ఎండింగ్ లో వచ్చిన రాజమౌళి రాజముద్ర వరకు ప్రతిదీ సూపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు రాజమౌళి. ఆయన మేకింగ్ స్టైలే ఈరోజు ఆయన్ని భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిపింది. మిగతా దర్శకులందరూ ఒక దారిలో వెళితే, జక్కన్న వేరే దారిలో వెళతారు. ఆ కొత్తదనమే దర్శకుడు రాజమౌళిని ఈరోజు ఎవరికీ అందనంత దూరంలో ఉంచింది.
ఇక ఆయన సినిమాలు గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు, ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఇక ఆయన రాసిన స్క్రీన్ ప్లే గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. సినిమా స్టార్ట్ అవ్వగానే మొదలైన టైటిల్ కార్డ్స్ నుండే రాజమౌళి మ్యాజిక్ మొదలైపోతుంది. దాంతో సగటు సినిమా ప్రేక్షకుడు తనకు తెలియకుండానే సినిమాలో లీనం అయిపోతాడు. అదే మత్తులో సినిమాను చివరి వరకు చూసి, తెలియని తన్మయత్వం పొందుతాడు సినిమా ప్రేక్షకుడు. సినిమా థియేటర్లో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే హ్యాంగ్ ఓవర్ లో ఉంటాడు సగటు ప్రేక్షకుడు. అంత గమ్మత్తుగా సినిమానే తెరకెక్కిస్తాడు కాబట్టే, రాజమౌళి భారతీయ సినిమాకి నేడు రాజయ్యాడు. దాంతోనే బాలీవుడ్ హీరోలు సైతం ఇప్పుడు రాజమౌళి తమతో ఎప్పుడెప్పుడు సినిమా చేయబోతాడా అని పడిగాపులు కాస్తున్న పరిస్థితి!