ఈ క్రమంలోనే కడపలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా అప్సర థియేటర్లో జరిగిన ఆ సంఘటన ఎన్టీఆర్ అభిమానులను కలచివేస్తుంది. అప్సర థియేటర్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో అభిమాని హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టు తెలుస్తోంది. మృతి చెందిన ఎన్టీఆర్ అభిమానిని సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఎన్టీఆర్ అభిమాన సంఘం జూనియర్ ఎన్టీఆర్ కి చేరవేసినట్టు కూడా గుసగుసలు వినబడుతున్నాయి.
అయితే, ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ కాబోతారా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా, పర్సనల్ గా ఎదురు చూస్తున్నారు. ఇక మాస్ సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. రిలీజ్ కు వారం రోజులు ముందే ఫ్యాన్స్ తన హంగామా షురూ చేస్తారు. అయితే ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంలో సదరు హీరోలు కూడా నైతిక బాధ్యత వహించాలని, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే హీరోలది ఏముంది? కోట్ల కొలది డబ్బులు తీసుకుని సినిమాలు చేస్తుంటారు. వారికి అదొక బిజినెస్ మాత్రమే. కానీ మరణించిన వారైతే తిరిగి రారు కదా? వారి పైన వారి జీవితం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విషయాలు సదరు హీరోలు తన అభిమానులకు అర్థం అయ్యేలా చెబితే బాగుంటుందని విశ్లేషకులు మాట. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడు పాత్రలో తనదైన మార్క్ చూపించారని చెబుతున్నారు. ఇక మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూసినట్లయితే, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.