కొరటాల శివ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన కథ రచయితగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత సినిమా దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన తన కెరియర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన అందులో ఆచార్య మూవీ ని మినహాయిస్తే అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే మూవీ ని రూపొందించాడు. 

మూవీ ఈ రోజు థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా , సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈరోజు విడుదల అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలైన టాక్స్ వస్తున్నాయి. అందులో కొంత మంది ఆచార్య మూవీ తో పోల్చినట్లయితే దేవర మూవీ కోసం కొరటాల అద్భుతమైన స్టోరీని తీసుకున్నాడు. 

కాకపోతే దానిని ఒకే భాగంలో చూపిస్తే బాగుండేది. రెండవ భాగంతో దానిని చూపించాలి అనుకోవడంతో దేవర మొదటి భాగంలోని రెండవ భాగం బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాను ఒకే భాగంలో తీయాలి అనుకున్నట్లు అయితే అది అద్భుతంగా ఉండేది. సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అని కొంత మంది అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంటే కొరటాలకు ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కు జోడి గా నటించింది . ఈమె ఈ సినిమాలో తన నటన కంటే కూడా అందం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: