టాలీవుడ్ సీనియర్ హీరోల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరో వ‌చ్చిన‌ అల్లుడుగారు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో తెరుగులోని అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్న హీరోలలో మోహన్ బాబు ఒకరు. అందుకే ఆయన్ని అప్పట్లోనే కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ తో  పిలిచేవారు ఆయన సిని ప్రయాణంలో అల్లుడుగారు అనే సినిమా ఎవర్గ్రీన్ సినిమాని అంటారు.

ఆ సమయంలో వచ్చిన అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడి గారి పెళ్ళాం, పెద్దరాయుడు, అల్లరి మొగుడు వంటి సినిమాలు ఆయనకు భారీ స్టార్ డంను తెచ్చిపెట్టాయి. ఇక అల్లుడుగారు సినిమా విషయానికి వస్తే మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేందర్రావు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథ మొదట్లో చిరంజీవి వద్దకు వెళ్లిందట.

రాఘవేందర్రావు ఈ సినిమాను చిరంజీవితో చేయాలని ముందుగా భావించారట. అంతకుముందే వీరు కాంబినేషన్ జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమాతో హిట్ కొట్టాలని రాఘవేంద్రరావు భావించారు. ఈ క్రమంలోనే అల్లుడుగారు కథను చిరంజీవికి చెప్పారట అయితే ఈ సినిమా క్లైమాక్స్ నచ్చక చిరు మార్పు చేయమని చెప్పారట. అయితే క్లైమాక్స్ మార్చడం ఇష్టం లేక అల్లుడుగారు సినిమాని రాఘవేంద్రరావు మోహన్ బాబుతో తీశారట.

అలా మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.కానీ, సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీదే ఆధారపడివుంటుంది కాబట్టి తరువాత దీన్ని మార్చలేక కథ ప్రకారం సినిమా తీయాలని అనుకొని, మోహన్ బాబును హీరోగా ఎంచుకున్నారు.ఇకపోతే ఈ సినిమాతో మోహన్ బాబుతోపాటుగా శోభన, చంద్రమోహన్, సత్యనారాయణ లాంటి నటులు నటించడం జరిగింది. ఈ సినిమాతో మోహన్ బాబు దశ మొత్తం తిరిగిపోయింది అని కూడా అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: