టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది హీరోలకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి గుర్తింపు కలిగిన వారు కొంత మంది ఉన్నారు. అలా ఇతర ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోలలో అల్లు అర్జున్ , రామ్ పోతినేని కూడా ఉన్నారు. అల్లు అర్జున్ కంటే కూడా ఓ ఏరియాలో రామ్ పోతినేని కి భారీ ఎత్తున క్రేజ్ ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా ..? అదే హిందీ మార్కెట్లో. అల్లు అర్జున్ హీరో గా రూపొందిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయినా సందర్భాలు ఉన్నాయి. అలా డబ్ అయిన సినిమాలకు యూట్యూబ్లో అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే రామ్ పోతినేని హీరో గా రూపొందిన సినిమాలు కూడా చాలానే హిందీ లో డబ్ అయ్యాయి. ఇక యూట్యూబ్ ఛానల్ లో రామ్ పోతినేని సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఓ విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాల కంటే కూడా రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్థాయి రెస్పాన్స్ దక్కుతుంది. ఈయన నటించిన చాలా సినిమాలకు వందల మిలియన్ వ్యూస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో రామ్ పోతినేని సూపర్ గా సక్సెస్ అయ్యాడు.

కొంత కాలం క్రితం ఈయన నటించిన స్కంద సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే రామ్ కి హిందీ ఏరియా నుండి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక తాజాగా రామ్ "డబల్ ఇస్మార్ట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: