టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ 30వ సినిమా గా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ తర్వాత దాదాపు రెండున్నరేళ్ళ గ్యాప్‌తో ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం అలాగే తారక్‌ను సోలోగా చూసి ఆరేళ్లు గ్యాప్ రావడంతో.. సినిమాపై రిలీజ్ కు ముందే ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి.ఇదిలావుండగా తాజాగా అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ఆయనపై అభిమానాన్ని చాటుకుంటూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఆర్ఆర్ఆర్’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఏర్పడింది. అప్పటికే తారక్ కు జపాన్ దేశంలో ఏ రేంజ్లో అభిమానులు ఉంటారో తెలిసిందే. ఇక రీసెంట్ గా దేవర ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన తారక్ ను ఫ్యాన్స్ ను ఏవిధంగా రిసీవ్ చేసుకున్నారో చూశాం. ఇదిలా ఉంటే తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ తో కలసి దేవర సినిమా చూసేందుకు ఓ లేడీ ఫ్యాన్ ఏకంగా జపాన్ నుంచి అమెరికా కు వచ్చారు. ఆమెతో ఎన్టీఆర్ ముచ్చట్టించగా ఆ లేడీ ఫ్యాన్ తెగ మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ను దేవర టీమ్ సోషల్ మీడియా లో పంచుకుంది.అమెరికా లో లాస్ ఏంజేలీస్ లో జరుగుతున్నా "బియాండ్ ఫెస్ట్ "లో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో తారక్ తన ఫ్యాన్స్ తో కలసి సినిమా ను వీక్షించారు.ఇక ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యూసుదా ఆర్ట్‌స్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్లో సినిమాలో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే దేవరా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లోను భారీ వసూళ్ళను కొల్లగొట్టి రికార్డులను క్రియేట్ చేసింది అలా డే 1కు దేవరా విపరీతమైన కలెక్షన్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా దేవర మార్కెట్‌లో.. కేవలం ప్రీ సేల్స్ లోనే రికార్డ్ గ్రాస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దెవరా కలెక్షన్‌లకు సంభందించిన మరో లేటెస్ట్ అప్డేట్ తెగ వైరల్‌గా మారుతుంది.
 ఈ క్రమంలో దేవర యూఎస్‌లో లాంగ్ రన్‌లో కలెక్షన్‌లు ఏ రేంజ్ లో కొల్లగొడుతుందో.. ఎంత మార్కులో సినిమా ఆగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: