లేటెస్ట్ గా విడుదలైన ‘దేవర’ మూవీకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ వీకెండ్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 140 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినప్పటికీ ఈసినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ఏదో ఒక అసంతృప్తి ఫీల్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



సాంకేతిక పరంగా ఈమూవీ చాల బాగున్నప్పటికీ కథ పరంగా ఈమూవీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీకి ఇలాంటి డివైడ్ టాక్ వచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ కొత్తదనం లేని కథలో హీరో అతడితో పాటు నటించిన నటీనటులు ఎంత కష్టపడినా ఆపాత్రలు సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకోలేక పోతున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



ఈమూవీని రెండు భాగాలుగా తీయాలని కొరటాల చేసిన ప్రయత్నం ఈమూవీకి వచ్చిన టాక్ తో ఎంతవరకు ముందుకు వెళుతుంది అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. సాధారణంగా కొరటాల శివ కథలలో సామాజిక చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అది ‘దేవర’ లో లోపించింది అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్రను విపరీతంగా ఎలివేట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన కొరటాల ఈమూవీ స్క్రీన్ ప్లే విషయంలో ఎందుకు పొరపాటు చేశాడు అంటూ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.



ఈసినిమాను చూసి బయటకు వచ్చిన సగటు ప్రేక్షకుడు తన ఇంటికి వెళ్ళాక ఈసినిమాకు సంబంధించి ఆలోచన చేస్తే రక్తపాతం అరుపులు కేకలు తప్పించి ఎటువంటి భావోద్వేగాన్ని కలిగించిన సీన్స్ లేకపోవడంతో ఈమూవీని రెండవసారి చూడటానికి ఆలోచించడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో కొరటాల భవిష్యత్ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ రావడమే కాకుండా అల్లు అర్జున్ తో ప్రభాస్ తో కొరటాల భవిష్యత్ లో తీయాలని ప్రయత్నిస్తున్న సినిమాలు ఎంతవరకు ముందుకు వెళతాయి అన్న సందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: