* ఆయనలాగా వెళ్తే చేతులు కాల్చుకున్నట్లే
* భారీ సినిమాలు హ్యాండిల్ చేసే సత్తా రాజమౌళికి ఒక్కడికే ఉంది
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
2015లో వచ్చిన ఎపిక్ యాక్షన్ మూవీ "బాహుబలి ది బిగినింగ్" వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఎవరికీ తెలియదు. అంతెందుకు ఇండియాలోనే తెలుగు సినిమాలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ రాజమౌళి బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్ పెంచేశారు. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది అయితే ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే. దీనికి రాజమౌళి పార్ట్ 2 కూడా ప్లాన్ చేసి, దాన్ని కూడా అద్భుతంగా తీసి మరొక గ్లోబల్ లెవెల్ హిట్ అందుకున్నాడు.
రాజమౌళి ఒక జీనియస్ డైరెక్టర్. ఎక్స్‌ట్రార్డినరీ, ఔట్‌స్టాండింగ్ టాలెంట్‌తో ఎలాంటి కథనైనా ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మార్చేయగలడు. ఎమోషన్, యాక్షన్, కామెడీ వంటి ఎలిమెంట్స్ ఎప్పుడూ ఉండేలాగా చూసుకుంటాడు. అలాగే కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ జక్కన్న పర్ఫెక్షన్ కోసం ఎన్ని రోజులైనా ఒకటే సీన్ తీయమన్నా తీస్తాడు. కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. డబ్బు కోసం పాకులాడే దర్శకుడు కాదు రాజమౌళి. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి అందించాలని అనుకుంటాడు. ప్రతి సీను కూడా వారిని అలరించాలని భావిస్తాడు. ఆయన బాహుబలిని రెండు పార్ట్స్ గా తీశాడు అంటే ఒక అర్థం ఉంది.
అయితే దీనివల్ల నిర్మాతలు కొన్ని వేల కోట్లు లాభపడ్డారు. ఈ బాహుబలి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం వల్ల చాలా డబ్బులు వచ్చాయి. అయితే మిగతా దర్శకులు కూడా రాజమౌళి లాగా తమ సినిమాలను భారీ బడ్జెట్ రెండు పార్ట్స్ గా తీసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు. రాజమౌళి లాగా పాతకాలం నాటి సినిమాలు లేదంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీసి ప్రేక్షకుల మీదకు వదిలి, ఎలాగోలా జేబులు నింపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాని మంచిగా తీయాలనే ఉద్దేశం కంటే దాన్ని రెండు పార్టులుగా తీసి పాన్ ఇండియా హిట్ సాధించాలని తాపత్రయం కనిపిస్తోంది.
ఉదాహరణకు దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ. ఆయన దేవర సినిమాని ఎంతగా పాడు చేయాలో అంతగా పాడు చేశారు. రాజమౌళిని చూసి ఆయన వాత పెట్టుకున్నట్లు అయింది. పాన్ ఇండియా, పెద్ద సినిమాలను హ్యాండిల్ చేయగల సత్తా ఒక్క రాజమౌళికే ఉంది. ఆ విషయం ప్రతిసారి ఎప్పుడూ అవుతూనే ఉంది. పెద్ద బడ్జెట్ పెట్టుకున్నా పెద్ద కథలు తీసుకున్న వాటిని సరిగా ప్రజెంట్ చేసే దర్శకుడు తెలుగులో ఉన్నారా అంటే ఇప్పటిదాకా ఎవరు దాన్ని నిరూపించుకోలేకపోయారు.