బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చూసే ప్రేక్షకులకి కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే? నబిల్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన నాటినుండి ఎంతో శ్రద్ధగా, చాకచక్యంగా తన గేమ్ తాను ఆడుకుంటున్నాడు. నొప్పించక తానొవ్వక అన్న మాదిరి సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు నబీల్ ఆఫ్రిది. దాంతో ఇతగాడికి ఫాలోయింగ్ కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. ఓ వర్గం వారు అయితే ఓటింగ్స్ దంచేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇతగాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసినదే. ఆ గుర్తింపుతోనే నబీల్ బిగ్బాస్ షోలో అవకాశం దక్కించుకున్నాడు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ప్రస్తుతం నబీన్ ప్రేమాయణం నడుపుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే అవి వట్టి పుకార్లే కాదండోయ్, తానే స్వయంగా ఆ విషయం చెప్పుకు రావడం చాలా ఆశ్చర్యకరం. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనతోపాటు యూట్యూబ్ ఛానల్ లో నటించిన ఆధ్యా రెడ్డి. వీరిద్దరూ కలిసి ఎన్నో రకాల వీడియోలు, రీల్స్ చేసిన సంగతి ఫాలోవర్స్ కి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ప్రేమలో పడ్డారట!

అయితే, నబీల్ బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టడంతో వీరి మధ్య కాస్త ఎడబాటు వచ్చిందని టాక్ వినబడుతుంది. అయితే బిగ్బాస్ షో వలన కొంతమంది ప్రేమ జంటల ప్రేమాయణం పూర్తిగా తలకిందులు అయిన సంగతి తెలిసిందే. మరి ఈ జంట తమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అయితే, వీరు త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారేమో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక గేమ్ విషయానికి వస్తే నవీన్ కచ్చితంగా ఫైనల్ వరకు చేరుకుంటాడని అతని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: