అవును, మీరు ఇక్కడ విన్నది, చూసింది నిజమే అని తెలుస్తోంది. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ విషయంలో ప్రముఖ వివాదాల దర్శకుడు చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. వాస్తవం దేవుడికి గాని, ఆ అమ్మాయి విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోట్లు గుమ్మరిస్తున్నాడని విశ్వసినీ వర్గాల సమాచారం. ఆమె మరెవరో కాదు.... అందాల కంటెస్టెంట్ సోనియా. ఎనిమిదవ సీజన్ బిగ్ బాస్ చూసినవారికి ఆమె సుపరిచితురాలే!

ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 8 లో సోనియా ఆటో తీరు గమనిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. చాలా వరకు ఆమె చుట్టూ వివాదాలే చుట్టుముడుతున్నాయి. కానీ ఆమె మాత్రం సేఫ్ జోన్ లో ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా బాగా వినబడుతున్నాయి. సోనియా మేనేజ్మెంట్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే విషయం ఏదైనప్పటికీ, బిగ్ బాస్ సోనియాని సంరక్షిస్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కొంతమంది విశ్లేషకుల మాట!

ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే, ఏ కారణం చేతనో మరి... ఆయన కళ్ళన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన అందగత్తెల మీదే ఉంటుంది. అయితే దీనికి కారణం ఆయా కంటెస్టెంట్ల ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బేసిక్ గానే వర్మ పబ్లిసిటీ స్టార్ కాబట్టి, ఆయనని ఆశ్రయించిన వారికి ఆటోమేటిక్ గా పబ్లిసిటీ ఇట్టే వచ్చేస్తుంది. దాంతో రాంగోపాల్ వర్మ అభిమానుల ఓటింగ్ కూడా వారికి సాయపడుతుంది. ఇక ఇరువురి మధ్య మ్యూచువల్ బెనిఫిట్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏ బెనిఫిట్ లేకుండా వర్మ అస్సలు పనిచేయడు. ఈ క్రమంలోనే సోనియా గెలవాలని వర్మ గట్టిగా నిర్ణయించుకుని, ఆమెపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని టాక్ వినబడుతుంది. అయితే నిజా నిజాలు దేవుడి కెరుక గాని, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV