- దేవ‌ర ఫ‌స్ట్ డే హిందీ వ‌సూళ్లు రు. 7 కోట్ల నెట్‌
- బాలీవుడ్ లో అంచ‌నాల‌ను మించిన ఎన్టీఆర్ సినిమా
- క‌థ‌నం కంటే కొత్త‌గా ఉన్న క‌థ‌కు బాగా క‌నెక్ట్ అయిన నార్త్ ఆడియెన్స్‌
- సైఫ్ ఆలీకాన్ - జాన్వీ క‌పూర్ కూడా బాగా ప్ల‌స్ అయ్యారే.. !
- ఫ‌స్ట్ వీకెంట్ లో మ‌రింత‌గా కుమ్మ‌డం ఖాయం


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ సినిమా దేవ‌ర‌. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన ఈ సినిమా పై రిలీజ్ కు ముందు క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యింది. తొలి రోజు బాలీవుడ్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో అంచ‌నాలు అందుకుంటుంది .. ఎలాంటి వ‌సూళ్లు వ‌స్తాయ‌న్న సందేహాలు ఉన్నాయి.


దేవ‌ర బాలీవుడ్ లో కూడా ఊచ‌కోత కోసి ప‌డేసింది. దేవర డే 1 గా ఒక్క హిందీలోనే 7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ నెంబర్ అనే చెప్పాలి. కొంచెం మిశ్ర‌మ స్పంద‌న ఉన్నా కూడా అక్క‌డ రు. 7 కోట్ల నెట్ అంటే గొప్ప విష‌యం అని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు కూడా అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ తో పాటు ఆ వెంట‌నే వ‌రుస‌గా ద‌స‌రా సెల‌వులు రావ‌డంతో దేవ‌ర ఏ మాత్రం ఫిక‌ప్ అయినా బీ టౌన్ .. నార్త్ లో కూడా మంచి వ‌సూళ్లు వ‌స్తాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: