- ఫ‌స్ట్ డే కే ఏకంగా 3. 5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు
- ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే స‌రికే 7 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు ప‌క్కా ?
- ఓవ‌ర్సీ స్‌లో ఎన్టీఆర్ ఊచుకోత షురూ .. !


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రి ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కి తగ్గట్టు ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో అన్న‌ది త్రిబుల్ ఆర్ సినిమాతో చూశాం. అయితే ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయినా కూడా అందులో మ‌రో హీరో రామ్ చ‌ర‌ణ్ ఉండ‌నే ఉన్నాడు. పైగా అది ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమా. అందుకే ఆ క్రెడిట్ ఖ‌చ్చితంగా ఎన్టీఆర్ కు మాత్ర‌మే ఇవ్వ‌లేం.


అయితే తాజాగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం లో ఎన్టీఆర్ చేసిన దేవ‌ర సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక మ‌రీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ తన స్టామినా చూపించాడు. దేవ‌ర తొలి రోజు పూర్తి కాకుండా నే ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని అందుకొని పూన‌కాలు లేపుతూ ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది. ఇక డే 1 పూర్తి కాకుండానే దేవర ఈ రేంజ్ విలయ తాండవం చేస్తున్నాడు. ఫ‌స్ట్ వీకెంట్ కంప్లీట్ అయ్యే స‌రికే దేవ‌ర 6 - 7 మిలియ‌న్ డాల‌ర్ల రేంజ్‌లో అక్క‌డ వ‌సూళ్లు సాధిస్తాడ‌ని అమెరికా ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: