- ఏపీ - తెలంగాణ డే 1 బెస్ట్ షేర్ రెండు సినిమాలు ఎన్టీఆర్ వే
- తొలి ప్లేస్ లో త్రిబుల్ ఆర్ .. రెండో ప్లేస్ లో దేవ‌ర‌
- మూడో స్థానానికి ప‌డిపోయిన ప్ర‌భాస్ స‌లార్‌


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ కు జోడీ గా జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టించింది. అయితే దేవ‌ర రిలీజ్ కు ముందే ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నే ఏకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 84 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. గురువారం అర్ధ‌రాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. తొలి రోజు దేవ‌ర ఏపీ - తెలంగాణ‌లో ఏకంగా రు. 54 . 21 కోట్ల షేర్ సాధించింది. ఈ క్ర‌మంలోనే దేవ‌ర ఏపీ - తెలంగాణ లో ఇది రెండో హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు..


ఏపీ - తెలంగాణ లో ఫ‌స్ట్ డే హ‌య్య‌స్ట్ షేర్ సాధించిన సినిమా గా త్రిబుల్ ఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డుల్లో ఉంది. టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ . రౌద్రం రణం రుధిరం సినిమా పేరిట ఉంది. ఆ సినిమా రూ. 74.11 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్నటి వరకు ఆ తర్వాత స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ న‌టించిన స‌లార్ ఉండేది.  ఆ సినిమాకు తెలంగాణ, ఏపీలో మొదటి రోజు రూ. 50.49 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు రూ. 54.21 కోట్ల షేర్ సాధించి రెండో స్థానంలోకి దేవ‌ర వ‌చ్చింది. ఇలా ఏపీ , తెలంగాణ ఫ‌స్ట్ డే హ‌య్య‌స్ట్ షేర్ సినిమాలు రెండు ఎన్టీఆర్ పేరిటే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: