- జాన్వీ కి నాలుగు సీన్ల‌కు రు. 4 కోట్ల రెమ్యున‌రేష‌న్‌
- ఒక్కో సీన్ కు స‌గ‌టున కోటి రెమ్యున‌రేష‌న్‌
- దేవ‌ర 1 హిట్ తో పార్ట్ 2 మ‌రింత డిమాండ్ త‌ప్ప‌దా ?


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ తెలుగు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని క‌ళ్ల ల్లో ఒత్తులు వేసుకుని గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా వెయిట్ చూసిన అభిమానుల కోరిక ఎట్ట‌కేల‌కు దేవ‌ర సినిమా తో తీర్చింది. దేవ‌ర‌ సినిమాలో జాన్వీ స్క్రీన్ ప్రజెన్స్ జ‌స్ట్‌ ఓకే అనిపించుకొంది. ‘చుట్ట‌మ‌ల్లె’ పాట‌లో అయితే డాన్సుల్లోనూ చాలా గ్లామ‌ర్ గా క‌నిపించి ఆక‌ట్టుకొంది. త‌న అందం తో పాటు నాభి అందాలు కూడా బాగానే చూపించింది. అయితే ఈ సినిమాలో జాన్వీ రోల్ చాలా చిన్న‌దంటే చిన్న‌ది అని చెప్పాలి.


ఇక సినిమా లో ఆమె పాత్ర చాలా చిన్న‌ది కావ‌డంతో పాటు సినిమా ఫ‌స్టాఫ్‌లో అస‌లు క‌నిపించ‌లేదు. దీంతో సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కులు కూడా ఒకింత నిరాశ‌కు గుర‌య్యారు. ఇక సెకండాఫ్‌లోనూ త‌ను ఉన్న‌ది నాలుగైదు సీన్ల‌లో మాత్ర‌మే.. ఆమె రెండు పాట‌ల్లో న‌టించినా ఒక పాట తీసేశారు. ఇక ఓ నాలుగు సీన్లూ, ఒక పాట‌కూ తాను అందుకొన్న పారితోషికం అక్ష‌రాలా రూ.4 కోట్లు.అంటే స‌గ‌టున జాన్వీ చేసిన ఒక పాటు.. ఓ నాలుగు సీన్ల‌కు కలిపి ఆమెకు రు. 4 కోట్లు ముట్టాయి. ఒక్కో సీన్ కు కోటి చొప్పున జాన్వీ తీసుకుంద‌నే చెప్పాలి. ఇది ఆమెకు చాలా ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌. ఇక రెండో పార్ట్ కు ఆమె మ‌రింత ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకోనుంది. ఇక దేవ‌ర తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్లు దుమ్ము అయితే దులి పేసింద‌నే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: