యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితం సోలో హీరోగా అరవింద సమేత అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే , ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా , నాగేంద్ర బాబు ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 21. 7 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. కాకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందిన మూవీ కావడంతో దీనిపై మొదటి నుండి ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ కూడా భారీ స్థాయిలో వచ్చినా కూడా కలెక్షన్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అరవింద సమేత టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వసూలు చేసిన కలెక్షన్లలో సగాన్ని దేవర పార్ట్ 1 మూవీ మొదటి రోజే నైజాం ఏరియాలో వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: