సినీ పరిశ్రమలో ఉన్న హీరోలలో కొంత మంది హీరోల సినిమాలకు హిట్ టాక్ , బ్లాక్ బాస్టర్ టాక్ వస్తేనే మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే అలాంటి హీరోల సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చిన , ఫ్లాప్ టాక్ వచ్చిన కూడా అసలు కలెక్షన్లు రావు. కానీ మరి కొంత మంది హీరోలకు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్లు వస్తాయి. అలాగే వారి సినిమాలకు హిట్ టాక్ , బ్లాక్ బాస్టర్ గనక వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అలాంటి హీరోలు మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా చాలా మంది ఉన్నారు.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ ముందు వరసలో ఉంటారు. ఇక ప్రస్తుతం వీరు స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరు నటించిన సినిమాలకు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన , నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అదే వీరి సినిమాలకు కనుక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లు అయితే కలెక్షన్ల వర్షం బాక్స్ ఆఫీస్ దగ్గర కురుస్తుంది. ఇక వీరికి ఇంత క్రేజ్ ఉంది కాబట్టే వీరితో సినిమాలు చేయడానికి దర్శకులు , నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అలాగే వీరికి అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి వీరిపై చాలా మొత్తం ఖర్చు పెట్టి సినిమాలను రూపొందిస్తున్నారు. ఇక వీరి కెరియర్లో చాలా సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చినా కూడా వారి క్రేజ్ తో భారీ ఎత్తున కలెక్షన్లను వెనక్కు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో వీరు నటించిన సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఎంతో కొంత శాతం డబ్బులు నిర్మాతకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: