టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవరా పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించాడు. జాన్వి కపూర్మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా నటించగా , సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ లభించింది. 

దానితో ఈ సినిమాకు పెద్ద ఎత్తున మొదటి రోజు కలెక్షన్లు వస్తాయా రావా అనే అనుమానాలు చాలా మంది లో వ్యక్తం అయ్యాయి. కానీ ఈ మూవీ మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: