జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా మొదటి భాగం  సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.దేవర.. దేవర..ఎక్కడ చూసినా థియేటర్లలో దేవర హవానే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే చాలు దేవరకి సంబంధించిన విషయాలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. టీవీ ఆన్ చేసినా దేవర టాకే వినిపిస్తోంది. ఇలా ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్ దేవర మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి నుండే దేవరకు సంబంధించిన షోలు పడిపోయాయి.దీంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులు సినిమా ఎలా ఉందో పంచుకున్నారు. ఇక కొంతమంది అయితే విపరీతంగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే దేవర సినిమా బాగున్నప్పటికీ కొరటాల డైరెక్షన్ మ్యాజిక్ ఇందులో చూడలేమని తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు కొరటాల ఎలా డైరెక్షన్ చేశారో ఆ డైరెక్షన్ మ్యాజిక్ ఈ మూవీలో కనిపించలేదని తెలుస్తోంది. అయితే మరీ అంత బ్యాడ్ అయితే లేదు. సినిమా బాగుంది.ఎన్టీఆర్ అభిమానులకు ఇది బ్లాక్ బస్టర్. కానీ కొంతమంది మాత్రం కావాలనే పనిగట్టుకొని మరీ దేవర సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ఎ,న్టీఆర్ నటన, పాటలు అన్నీ బాగున్నాయి.కానీ జాన్వి కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది.ఈమె ఓ నాలుగైదు సన్నివేశాలు తప్ప ఎక్కడ కనిపించలేదు. 

ఇంటర్వెల్ అయ్యే వరకు కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించకపోవడం ఆమె అభిమానులకు కాస్త నిరాశ అని చెప్పుకోవచ్చు.ఇక విజువల్స్,స్క్రీన్ ప్లే కాస్త బాగున్నప్పటికీ  ఏదో ఒక దగ్గర కాస్త తేడా అయితే కొట్టింది. అయితే సినిమా బాగోలేదని కాదు యావరేజ్ గా ఉంది. ఒకసారి ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడొచ్చు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ పై కుట్ర చేసి సినిమాపై నెగటివ్ టాక్ వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఇక సినిమా కథ బాగుంటే ఎంత నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా సినిమాకి ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.ఇదిలావుండగా దేవరనెగిటివ్ టాక్ రావడం తో బన్నీ ఫ్యాన్స్  హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర.ఆచార్య చూసి మెగా అభిమానులు ఎంత బాధపడ్డారో..ఇప్పుడు దేవర చూసి ఎన్టీఆర్ అభిమానులు అంతే బాధపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చిందని కాదు..ఈ సినిమాను అల్లు అర్జు రిజక్ట్ చేసాడని..అవును ఈ కథను ముందు గా శివ..బన్నీ కి వినిపించాడట. కానీ బన్నీ నో చెప్పడంతో కాస్త అటు ఇటు చేంజ్ చేసి ఎన్టీఆర్ కు వినిపించాడట. శివ పై నమ్మకం ..గతంలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఇవ్వడం తో ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా రెండేళ్లు ఈ మూవీ కోసం డేట్స్ కేటాయించాడు. కానీ ఎన్టీఆర్ నమ్మకాన్ని శివ నిలుపుకోలేకపోయాడు. ఇలా ఎన్నో అంచనాలను కొరటాల శివ తలకిందులు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: