నైజాం ఏరియా లో విడుదల అయి న మొదటి రోజు అత్యధిక కలెక్షన్ల ను వసూలు చేసిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 23.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 22.64 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 22.53 కోట్ల కలెక్షన్లతో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 19.60 కోట్ల కలెక్షన్లతో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది. 

మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 16.45 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ 13.68 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా 12.24 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో నిలవగా , భీమ్లా నాయక్ మూవీ 11.85 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. పుష్ప పార్ట్ 1 సినిమా 11.44 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో నిలువగా , రాదే శ్యామ్ మూవీ 10.80 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: