- ఏపీ లో వైపీపీ కేడర్ నుంచి ఫుల్ సపోర్ట్ ?
- తెలంగాణ లో బీఆర్ఎస్ నుంచి మద్దతు ?
- తెలుగుదేశం వీరాభిమానులు దూరంగా ఉన్నారా ?
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల తర్వాత అంటే 2018 చివర్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర నిన్న రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమా తోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా చుట్టూ రాజకీయ కోణం కూడా ముసురు కుంది.
కారణం ఏంటో తెలియదు గాని .. లేదా రకరకాల కారణాలు ఉండొచ్చు కాక .. ఎన్టీఆర్ తెలుగుదేశంకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎన్టీఆర్ టీడీపీ - నారా .. నందమూరి కుటుంబాల విషయంలో నిజంగా సైలెంట్ గా, నిజాయితీగా ఉన్నాడని టీడీపీ క్యాడర్ కు అనిపిస్తే వేరే భాషల మీద ఆశలుపెట్టుకునే దుస్థితి ఎన్టీఆర్‌కు ఎప్పటికీ ఉండదు అన్న టాక్ కూడా ఇప్పుడు గట్టిగా నడుస్తోంది. ఎన్టీఆర్ వెండి తె ర మీద మంచి నటుడు అని.. కానీ నిజ జీవితంలో నూ నటిస్తున్నాడని కొందరు టీడీపీ వాళ్లే కామెంట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ ను ఉద్దేశించి కొందరు ఫ్యాన్స్ వైసీపీ వాళ్లకు దగ్గరగానే ఉన్నావ్, బీఆర్ఎస్ వాళ్లకు దగ్గరగానే ఉన్నావ్... వాళ్ళు ఎవడూ కూడా నీకు సపోర్ట్ చేయలేదని కొందరు కామెంట్లు పెడుతుంటే .. మరి కొందరు మాత్రం ఎన్టీఆర్‌కు తెలుగుదేశం వాళ్లే సరిగా సపోర్ట్ చేయలేదు.. వైసీపీ . బీఆర్ ఎస్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.