దీని తర్వాత హర్ష సాయి ఆమెతో మాట్లాడుతున్న ఆడియోలు కొన్ని బయటకు వచ్చాయి. అదే పెద్ద సంచలనంగా మారాయంటే ఇప్పుడు మరో హర్ష సాయి మరొక ఆడియో బయటికి వచ్చి మరింత సంచలనం రేపుతోంది. ఈ ఆడియోలో వినిపించిన మాటల ప్రకారం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై బాధితురాలికి, హర్ష సాయికి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ బాధితురాలు హర్ష సాయి సినిమాలో నటించింది.
అయితే ఆ సినిమా కో ప్రొడ్యూసర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే హర్ష సాయి ఇమేజ్ దెబ్బ తింటుందని చెప్పాడట. అదే విషయాన్ని చెబుతూ, బాధితురాలు వాపోయినట్లు లీకైన ఆడియో ప్రకారం తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ప్రభావం 'మెగా ' సినిమాపై కూడా పడుతుందని, అందుకే దాన్ని ఆపివేయాలని బాధితురాలు హర్ష సాయిని కోరడం కూడా వినిపించింది. అతను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకే వారిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇదిలా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో "లోటస్ 360" బెట్టింగ్ యాప్‌ను బ్యాన్ చేసింది. అలాంటి సమయంలో ఈ బెట్టింగ్ యాప్ లింకు తన వీడియోలో పెడితే 10 కోట్లైనా ఇస్తారని బాధితురాలితో హర్ష సాయి వెల్లడించినట్లు ఆడియో విన్న వాళ్లు తెలుపుతున్నారు.
10 కోట్లు మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం ఎన్ని కోట్లయినా తాను హ్యాపీగా తీసేసుకుంటానని కరాకండిగా హర్ష సాయి చెప్పినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తాను కంపల్సరిగా చేస్తానని, అవి తన మార్కెట్ ర్యాలీని పెంచుతాయని హర్ష సాయి బాధితురాలతో మాట్లాడాడు. ఇల్లీగల్ పనులు చేస్తూనే హర్ష సాయి తాను చేసింది తప్పు కాదు అంటూ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. చివరికి హర్ష సాయి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.