కండక్టర్ టు పాన్ ఇండియా హీరో లెవెల్ కి ఎదిగిన రజినీకాంత్ సినిమాల్లోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మొదట్లో ఈయన స్టైల్ ని చూసి బస్సులో ఎక్కే ఓ యువతి ఆయనను సినిమాలో ట్రై చేయమని సలహా ఇచ్చింది.అంతేకాదు ఆయనకు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో ఆమెనే డబ్బులు కట్టి మరీ మద్రాస్ ఫిలిం ఇన్స్ ట్యూషన్ లో చేర్పించింది అని రజినీకాంత్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక హీరో అయ్యాక మళ్లీ బెంగళూరు వచ్చి చూడగా ఆమె ఎక్కడ కనిపించలేదని, ఆమె ఆచూకీ కూడా తెలియలేదని,కానీ ప్రతి సంవత్సరం ఆమె కనిపిస్తుందేమోనని బెంగళూరు వెళ్లి చూస్తానంటూ రజినీకాంత్ చెప్పారు.. అయితే రజినీ హీరో అవ్వడం వెనుక ఆ అమ్మాయి మాత్రమే కాదు ఓ వ్యక్తి కూడా ఉన్నారట.ఆయన రజినీకాంత్ హీరో అవ్వడానికి ఏకంగా తన దగ్గర ఉన్న బంగారం కూడా అమ్మేసి హీరోని చేశారట.

 ఇక ఆయన ఎవరో కాదు రజినీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి బహదూర్.. బస్ డ్రైవర్ అయినటువంటి బహదూర్ కండక్టర్ అయినటువంటి రజినీకాంత్ మధ్య ఎప్పటినుండో స్నేహం ఉంది. అయితే రజినీకాంత్ ని అందరూ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట. కానీ ఎవరూ కూడా ఒక్క రూపాయి డబ్బు ఇవ్వడానికి ముందుకు రాలేదట.కానీ బహదూర్ మాత్రం తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ అమ్మి మరీ తన ఫ్రెండ్ రజినీకాంత్ కి డబ్బులు ఇచ్చి సినిమాల్లోకి పంపారట.


అలా రజిని హీరో అవ్వడం వెనుక ఆయన ఫ్రెండ్ బహదూర్ కృషి ఎంతగానో ఉందట. ఇక రజినీ హీరో అయ్యాక కూడా ప్రతి సంవత్సరం బెంగళూరుకి వెళ్తారట.అలాగే బహదూర్ చెప్పిన ఏ విషయాన్నీ కూడా రజినీకాంత్ కాదనరట. అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. అయితే కొంతమంది మంచి పొజిషన్ వచ్చాక వారికి ముందు ఎవరు సపోర్ట్ చేశారు.. ఎవరు డబ్బులు ఇచ్చారు అనేది మర్చిపోతారు. కానీ రజినీకాంత్ అలా కాదు. తనకి సహాయం చేసిన స్నేహితుని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: