మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎప్పుడో చేసిన పనులు,  కొంత కాలం తర్వాత అవి మనకు రివర్స్ తగలటం తెలిసిందే. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లాగే బ‌ట్ట‌ర్ ప్లై ఎఫెక్ట్ లాగా అప్పుడెప్పుడో అక్కడెక్కడో జరిగిన విషయానికి ఇప్పుడు రియాక్షన్ ఉంటుందన్న నానుడికి ప్ర‌స్తుత సంఘటన మంచి ఎగ్జాంపుల్. గతంలో ఎప్పుడో తెలియక మనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయటికి వస్తే అవి తెచ్చే ఇబ్బందికర పరిస్తితులు మామూలుగా ఉండవు. అయితే అవి అవతలి వారిని విమర్శించే విధంగా ఉంటే మనం ఇష్టపడే వారికి కూడా లేనిపోని కష్టాలు తెచ్చిపడతాయి. ఇప్పుడు ఇదే సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత విషయంలో నిజమయింది. ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో అప్పటి స్టార్ హీరోయిన్స్ అయ‌న శ్రీదేవి, జుహీచావ్లా, మాధురి దీక్షిత్ లపై ఆమె చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


అసలు విషయానికొస్తే.. నమ్రత 2005లో మహేష్ ని పెళ్లి చేసుకునే అంతవరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతూ మంచి ఫ్రేమ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె హీరోయిన్ గా ఉన్న సమయంలో వెబ్సైట్లో మ్యాగజైన్లతో మంచి సంబంధాలు కలిగి ఉండేది. తరచూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేది. అలాగే ఓ సందర్భంలో Reddit అనే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఆమె తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఆ క్రమంలోనే ఓ అభిమాని శ్రీదేవి, జుహీ చావ్లాలు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. మరి మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు అని అడిగారు...

దీనికి న‌మ్ర‌త సమాధానం ఇస్తూ.. నేను ఖచ్చితంగా నా భవిష్యత్తుని కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని.. జుహీచావ్లా, శ్రీదేవి ఇద్ద‌రు లో సొసైటీకి చెందిన మనుషులంటూ వ్యాఖ్య‌లు చేసింది. నేను శ్రీదేవిని ఎప్పుడు కలవలేదు కానీ.. ఆమె మనుషులని సరిగ్గా రిసీవ్ చేసుకునే మనిషిలా కనిపించలేద‌ని, ఫ్రిడ్జ్‌లోని ఐస్ వంటిది అని చెప్పుకొచ్చింది. ఇక మాధురి దీక్షిత్ గురించి అడగగా.. మాధురీ తనకు మంచి స్నేహితురాలే కానీ ఆమె అమ్మ చాటు అమ్మాయని మోడ్రన్ సొసైటీకి సింక్ అవ్వదు కానీ గొప్ప నటి అని చెప్పింది. ప్రస్తుతం ఈ చాట్ సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ కావ‌డంతో శ్రీదేవి, మాధురి ఫాన్స్ నమ్రతాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: