మొదటిసారిగా 2012లో శృతి హరిహరాన్ నటించిన మలయాళ చిత్రం కంపెనీ సినిమాతో హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత నీల, సోలో వంటి చిత్రాలలో కూడా నటించింది. మొదటిసారిగా ఇమే అర్జున్ సర్జా తనను కౌగిలించుకునే విధానాన్ని వివాదంగా తీసుకువచ్చింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా ఇమే ఫిర్యాదు చేయగా అర్జున్ పైన సరైన సాక్షాదారాలు లేకపోవడంతో కోర్టు కూడా ఈ కేసుని కొట్టివేసింది. అలాగే 5 మంది తమిళ నిర్మాతలు తనకోసం ఒక వలవేసారని చెప్పి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.
2018లో శృతి వెల్లడించిన విషయాలు తమిళ నిర్మాత తనను లైంగికంగా లొంగదీసుకోవడానికి ఒక కమిట్మెంట్ అడిగారని.. ఐదు మంది నిర్మాతలు ఉన్నాము కాబట్టి.. ఐదు మంది నిర్మాతలకు కమిట్మెంట్ అడిగారని అయితే ఈ విషయం పైన తాను అభ్యంతరం చెప్పడంతో తమిళ సినిమా నుంచి తనని తీసివేశారు అంటూ తెలియజేసింది శృతి హరిహరన్. అప్పట్లో హైదరాబాదులో జరిగిన ఒక ఈవెంట్లో ఈ విషయాలను తెలిపిందట. అయితే కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు తన వయసు 18 సంవత్సరాలేనని ఈ విషయం విని తను చాలాసార్లు ఏడ్చానని తెలిపింది. అందుకే తమిళంలో తాను ఎక్కువ సినిమాలు నటించలేకపోయాను అంటూ శృతి తెలియజేసింది..