రాధిక కుమార్ స్వామి అంటే పెద్దగా ఎవరికి తెలియదు కానీ.. కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమెను తెలియని వారు ఉండరు. హీరోయిన్గా కంటే మాజీ సీఎంతో అమెకున్న సంబంధాల కారణంగానే ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచేది. 2006లో క‌ర్ణ‌ట‌క‌ మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. కుమారస్వామి తో ఆమెకున్న రిలేషన్ గురించి చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ వర్గాల వరకు ఎన్నో చర్చలు నడిచాయి. దీంతో ఆమె సినీ జీవితం అక్కడితో క్లోజ్ అయింది. ఇక మరోవైపు కుమారస్వామి రాజకీయ జీవితం కంటే ఆయన వ్యక్తిగత జీవితం పైనే ప్రజలు ఆసక్తి కనబరిచే వారు.

కుమార్ స్వామితో పెళ్లి సమయంలో రాధిక ఆయనకంటే 27 సంవత్సరాల చిన్నది. అయితే వీరిద్దరికి అది రెండో వివాహం. కుమార్ స్వామి మొదటి పెళ్లి అనితతో 1986 లో జరిగింది. ఇక రాధిక మొదటి పెళ్లి 2000 సంవత్సరంలో జరిగింది.. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఆ సమయంలో రాధిక తండ్రి మాజీ ముఖ్యమంత్రితో తన కుమార్తె పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఆమె పెద్దలను ఎదిరించి రాధిక కుమారస్వామిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో రాధిక నిర్ణయం  కర్ణాటకలో పెను సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఇక ఈమె దాదాపు 30కు పైగా సినిమాల్లో నటించింది. కుమారస్వామి తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. రాధిక తన 14వ ఏట 'నేనగాగి' సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె 9వ తరగతి చదువుతోంది. 2002లో విడుదలైన 'నీల మేఘ శమ' చిత్రం ద్వారా ఆమె సక్సెస్ అందుకుంది. అలాగే తెలుగులో కూడా ఈమె నందమూరి హీరో తారకరత్న హీరోకి వచ్చిన భద్రాద్రి రాముడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా మారి లక్కీ అనే సినిమాను నిర్మించింది. ప్రస్తుతం రాధిక సినిమా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిని పెళ్లాడి కోటీశ్వరురాలైంది. పలు నివేదికల ప్రకారం ఆమె ఆస్తి విలువ.. రూ.124 కోట్లు, ఆమె భర్త కుమారస్వామి ఆస్తి విలువ రూ.44 కోట్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

cm