ఇప్పుడు అదే విషయం సినిమాకి మైనస్ అయిందని కూడా విశ్లేషకులు అంటున్న మాట. ప్రకాష్ రాజ్ పాత్ర, మీరు ఒక పాత్రతో, దేవరను చంపే మగాడు ఇక పుట్టలేదా? అని ప్రశ్నించినప్పుడు... ఎందుకు పుట్టలేదు? దేవరను చంపింది తన కొడుకు వర... అతను మాత్రమే దేవరను అంతం చేయగలడు! అన్న డైలాగ్ వచ్చినప్పుడు, బాహుబలి సినిమాలోని, కట్టప్ప మాదిరి వర క్యారెక్టర్ దేవరకొండలో గుణపం దింపుతుందట! ఇక దాంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుందట!
ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కామన్ ఆడియన్ ట్రోల్ చేస్తున్నాడు. అసలు దర్శకుడు కొరటాల శివ, బాహుబలి లాంటి సినిమా తీయాలనుకున్నాడా? లేదంటే బాహుబలిని మించిపోయే సినిమా తీయాలనుకున్నాడా? అనే విషయం మాకు అర్థం కాలేదు! అని కామెంట్లు పెడుతున్నారట. ఇక ఈ కామెంట్లకు సమాధానం చెప్పలేని ఎన్టీఆర్ అభిమానులు కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్టు సమాచారం. నిన్నటికి నిన్న థియేటర్లో వద్ద టపాసులు పేల్చిన ఎన్టీఆర్ అభిమానులు, ఈరోజు సైలెంట్ అయిపోయారు. ఆ ట్విస్ట్ సాధరణ ఆడియన్స్ కే కాకుండా జూనియర్ అభిమానులకు కూడా అంతగా నచ్చలేదట! ఎందుకంటే? దేవరను వర చంపడంలో అస్సలు అర్థమే లేదని ఫీలవుతున్నారు జనాలు! ఒక ఈ సినిమాను మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు!