నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లను దూరం పెట్టింది అని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు రూమర్లు కాదు నిజమే అన్నట్లుగా బాలకృష్ణ ప్రవర్తన ప్రతి సందర్భంలో అర్థమవుతుంది.. అయితే అలాంటి బాలకృష్ణ తాజాగా ఓ ఈవెంట్లో  ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు అసలు తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్లు మాట్లాడడం చాలా మందిని బాధ పెట్టింది.అయితే తాజాగా బాలయ్య దుబాయ్ అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నీ జీ తెలుగు చీఫ్ ఎడిటర్ భరత్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు.ఇందులో మోక్షజ్ఞ కి సంబంధించిన సినిమా ముచ్చట్లు చెప్పండి అంటే ఇప్పుడే కథను లీక్ చేస్తే ఎలా అంటూ తెలివైన ఆన్సర్ ఇచ్చారు బాలయ్య బాబు. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేశారు అంటూ బాలయ్య నటించిన నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలను గుర్తు చేశారు.

 అలాగే అఖండ వంటి సినిమాని కరోనా సమయంలో అందరూ భయపడుతున్న టైంలో కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చే రిలీజ్ చేశామని,అసలు ఆ టైంలో రిలీజ్ చేసిన ఏకైక మూవీ అఖండ అంటూ బాలకృష్ణ చెపుకొచ్చారు. అంతేకాదు అఖండ సినిమా ని చూసి చాలామంది దర్శక నిర్మాతలు ముందుకు వచ్చి తమకి సంబంధించిన సినిమాలను కూడా రిలీజ్ చేసుకున్నారు అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు బాలకృష్ణ.అలాగే జీ తెలుగు చీఫ్ ఎడిటర్ మీ తర్వాత మీ వారసులు ఎవరు అని ప్రశ్నించగా.. నా తర్వాత నా వారసుడలు మోక్షజ్ఞ, నా మనవడు మనవరాళ్లు అంతే అంటూ బాలయ్య ఆన్సర్ ఇచ్చారు. అయితే జీ తెలుగు చీప్ ఎడిటర్ భరత్ బాలకృష్ణ ని ఇంటర్వ్యూ చేసిన వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే ఈ క్లిప్పింగ్ చూసిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల అభిమానులు బాలకృష్ణ మాట్లాడిన మాటలకు బాధపడుతున్నారు.మీ వారసులు ఎవరు అని అడిగితే అందులో మోక్షజ్ఞతో పాటు నా అన్న కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కూడా ఉన్నారని చెబితే బాగుండేది కదా..ఇప్పటికి కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ని దూరం పెడుతూనే ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పకపోయినా ఎవరు తప్పు పట్టేవారు కాదు.కానీ వీళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడం వల్ల బాలయ్య వారి పేర్లను ప్రస్తావించకపోవడంతో చాలామంది అభిమానులు బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: