దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దేవర‌ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ స్పెషల్ షోలు పడిపోయాయి. యుఎస్ ప్రిమియర్స్ టైంకే ఇక్కడ కూడా ప్రేక్షకులు షో చూసేశారు. హిట్‌ టాక్ దూసుకుపోతుంది. అదే విధంగా ఫస్ట్ డే కలెక్షన్ లో కూడా దేవర రికార్డులు సృష్టించాడు. 172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. చాలామంది ఈ సినిమాకు బాహుబలికి పోలిక పెడుతూ కామెంట్లో చేస్తున్నారు.

బాహుబలి సినిమాల లాగే ఇందులో కూడా తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటించాడు. అందులో స‌వతి సోదరుడు హీరోను చంపిస్తే ఇక్కడ స్నేహితుడు ఆ పని చేస్తాడు. హీరో కొడుకు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం వీల‌న్ని ఢీకొట్టడం కథాంశంగా సాగింది. మూవీ  క్లైమాక్స్ లో పార్ట్ 2 కు లీడ్గా చూపించిన సీన్ బాహుబలి తో పోలికలు పెట్టడానికి కారణమైంది. దేవర ఎలా చనిపోయారు అన్నది అక్కడ చూపించారు.  ఆ వ్యక్తి ఎందుకు చంపారు అనేది ఇప్పుడు క్యూస్షన్ మార్క్.

అసలు దేవ‌ర‌ అని ఎందుకు చంపాడు అన్న ఇంట్రెస్ట్ తో పార్ట్‌2  కోసం వెయిట్ చేసేలా సినిమాను ముగించాడు కొరటాల. దీంతో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి తరహాలో ఇక్కడ దేవరను ఆ వ్యక్తి ఎందుకు చెప్పాడని ప్రశ్నతో ప్రేక్షకులు ఊగిపోతారని కొరటాల ఆశించవచ్చు. ఐతే ‘బాహుబలి’ మాదిరి ఇక్కడ షాకయ్యే పరిస్థితి అయితే లేదు. ముందు ‘దేవర’కు ఎలాంటి ఫలితం వస్తుంది అన్నదాన్ని బట్టి ఈ ప్రశ్న పార్ట్-2 మీద హైప్ పెంచడానికి ఎంతమేర ఉపయోగపడుతుందని అన్నది చూడాలి. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ల బట్టి  రెండో భాగం కోసం కొరటాల బాగానే ప్లాన్ చేశాడని అనిపిస్తుంది. అయితే దేవర పార్ట్ 2 ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. వార్‌2,  ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత దేవరపై ఎన్టీఆర్ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అప్పటివరకు ప్రేక్షకులలో  దేవ‌ర పై బాహుబ‌లి ఇలా హైప్‌ ఉంటుందా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: