సినిమాల‌కు ప్రేక్షకులని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పించాలంటే కొన్ని సీజ‌న్ల‌కే బాగా సాధ్యం అవుతుంది. ఆ సీజ‌న్ల‌లో స్టార్ హీరోలు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే 2025 సంక్రాంతికి టాలీవుడ్‌లో అదిరిపోయే లైన‌ప్ ఉంది. అస‌లు చూస్తుంటే క్లిక్ అయితే అన్నీ వ‌రుస‌గా బడా ప్రాజెక్టుల‌తో టాలీవుడ్ స‌మ్మ‌ర్ బాక్సాఫీస్ షేక్ అయిపోనుంది.


2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో థియేట‌ర్ల లోకి దిగుతున్నాడు. అలాగే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక బాల‌య్య ఎన్బీకే 109 సినిమాతో దిగుతున్నాడు. ఆల్ మోస్ట్ సంక్రాంతి సీజ‌న్ సీనియ‌ర్ హీరోల ఫిక‌ప్ తో ఫిక్స్ అయిపోయింది. ఇక స‌మ్మ‌ర్ సెల‌వులు రెండు నెల‌ల పాటు ఉండ‌నున్నాయి. మార్చి స్టార్టింగ్ నుంచి మే ఎండింగ్ వ‌ర‌కు వ‌రుస పెట్టి ఈ సారి క్రేజీ సినిమాలు ఉండ‌నున్నాయి.


ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా మార్చి 28కి ఫిక్స్ చేశారు నిర్మాత‌లు. ఆ త‌ర్వాత రెండు వారాల గ్యాప్‌లో మారుతి - ప్ర‌భాస్ రాజా సాబ్ ఉంది. ఏప్రిల్ 10న రాజాసాబ్ ఉంది. ఆ వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ వీడీ 12 సినిమా లైన్లో ఉంది. మార్చి 28 గా ఫిక్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ కూడా మే 1 రిలీజ్ అంటున్నారు. రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ మూవీని ఏప్రిల్ 10న ఫిక్స్ చేశారు.


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కుభేర సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ కానుంది. ఎన్బీకే 109 సినిమా సంక్రాంతికి రాక‌పోతే స‌మ్మ‌ర్ కే వ‌స్తుంది. ఇవ‌న్నీ హిట్ అయితే స‌మ్మ‌ర్ లో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ లాడ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: