కోలీవుడ్ నటుడు శింబు తాజాగా పెళ్లికి రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే చాలాసార్లు శింబు పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.కానీ ఇప్పటివరకు ఏది నిజం కాలేదు.గతంలో హీరోయిన్ నయనతార, హీరోయిన్ హన్సికతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ హీరో కొన్ని కారణాల వల్ల ఇద్దరితో బ్రేకప్ చెప్పుకున్నారు. మొదట నయనతారని పెళ్లి చేసుకోవాలి అనుకున్న శింబుకి కొన్ని కారణాల వల్ల చుక్కెదురైంది. ఆ తర్వాత హన్సికతో కూడా చాలా సంవత్సరాలు ప్రేమాయణం నడిపి అది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక ఆ తర్వాత శింబు శ్రీలంక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని,కట్నం కూడా భారీగానే రాబోతుంది అంటూ ఎన్నో వార్తలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.కానీ అది కూడా నిజం కాలేదు.ఇక వీళ్లు ముగ్గురే కాకుండా మరో హీరోయిన్ తో కూడా శింబుకి పెళ్లి వార్తలు వినిపించాయి. 

ఇక ఆ నటి ఎవరో కాదు నిధి అగర్వాల్.. నిధి అగర్వాల్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో చేస్తూ కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తుంది.అయితే 2021లో శింబుతో కలిసి ఈశ్వరన్ అనే మూవీలో  నిధి అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమా సమయం నుండి నిధి అగర్వాల్ తో శింబు డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నో వార్తలు మీడియాలో గుప్పమన్నాయి. కానీ ఆ తర్వాత వీరి డేటింగ్ వార్తలు అటకెక్కాయి.
 

ఇలా ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకున్న సమయంలో మళ్ళీ కోలీవుడ్లో వీరి డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిధి అగర్వాల్ శింబు మళ్ళీ తమ డేటింగ్ ని కొనసాగిస్తున్నారని, ఇక ఈ విషయం ఇరుకుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శింబు ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న థగ్ లైఫ్ లో అలాగే నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: