నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. కొంత మంది దర్శకులు బాలయ్య కు వరుసగా అపజయాలు ఇచ్చిన మరి కొంత మంది దర్శకులు బాలయ్య కి సూపర్ సాలిడ్ విజయాలను వరసగా అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా బాలయ్య కు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలను అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. వీరి కాంబినేషన్లో మొదటగా లారీ డ్రైవర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో వీరి కాంబోపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత కొంత కాలానికి వీరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే మరో మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వీరి కాంబో సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబోలో సమరసింహా రెడ్డి అనే మూవీ వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తక్కువ కాలంలోనే వీరి కాంబోలో నరసింహ నాయుడు అనే మరో మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇలా వీరి కాంబోలో వచ్చిన నాలుగు మూవీలు వరసగా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక వీరి కాంబోలో ఐదవ సినిమాగా పలనాటి బ్రహ్మనాయుడు మూవీ వచ్చింది. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో హర హర మహాదేవ మూవీ ని లాంచ్ చేశారు. కానీ ఈ మూవీ స్టార్ట్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: