సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి గుర్తింపును కలిగి ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖుష్బూకు ఎంతో అభిమానం కాగా యమదొంగ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నటించిన చిత్రం 'దేవర'. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఆయన నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకున్న దేవర వసూళ్ల విషయంలో మాత్రం స్ట్రాంగ్‌గానే వుంది. మొదటిరోజు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి ప్రారంభ వసూళ్లను సాధించడమే కాకుండా డే వన్‌ వసూళ్లల్లో రికార్డులను కూడా నెలకొల్పింది.ఇదిలావుండగా సీనియర్ నటి ఖుష్బూ జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించింది ఖుష్బూ. తాజాగా మరోసారి ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు సినీరంగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు కదా. మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని ప్రశ్నించగా తెలుగులోనా, తమిళంలోనా అని అడిగింది ఖుష్బూ.తెలుగులో అనగానే. "నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని.నాకు తారక్ అంటే పిచ్చి. అతడి సినిమా విడుదలైందంటే చిన్న పిల్లలాగా థియేటర్ కి వెళ్లి విజిల్స్ వేయాలి. చప్పట్లు కొట్టాలి. పేపర్లు చించి విసిరేయాలంతే.. అతడిపై నా అభిమానం ఇలా ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చింది.  'స్టూడెంట్ నెం 1' సినిమా చూసినప్పటి నుండి ఎన్టీఆర్ కి అభిమానిగా మారానని ఖుష్బూ వెల్లడించింది.ఈ నేపథ్యంలో తాను లండన్ లో దేవర సినిమా చూసినట్లు సీనియర్ నటి ఖుషి్బు పోస్ట్ చేసారు. "ఇతనే నా హీరో. సూపర్బ్ మాస్". దీనిని నేను ఎలా మిస్ అవుతాను?"దేవర గా అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను"అని పేర్కొన్నారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ మేడం. మీకు నచ్చినందుకు సంతోషం అని రిప్లై ఇచ్చారు.ఇదిలావుండగా తారక్ తో మరో సినిమా చేయాలని తాను ఫీలవుతున్నానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ముఖ్యమైన రోల్ అయితే మాత్రమే నటిస్తానని ఖుష్బూ వెల్లడించారు. ఖుష్బూ చెప్పిన విషయాలు తారక్ దృష్టికి వస్తే తారక్ కచ్చితంగా ఛాన్స్ ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ కి ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీలు సైతం తారక్ ని అభిమానిస్తుంటారు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో తారక్ ఒకరు. ఇప్పుడు ఖుష్బూ అతడిని అంతగా అభిమానిస్తున్నానని చెప్పడంతో  ఆయన అభిమానులు సంతోషంతో  మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: