ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయంలో బిజీ అయిపోయిన తరువాత చేయవలసిన సినిమాలకు దూరంగా ఉండడంతో పవర్ ఫాన్స్ కూసింత అసహనంగా ఉన్నారని టాక్ వినబడుతోంది. ఈ క్రమంలోనే పవన్ నెక్స్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అలాంటివారికి ఇపుడు క్రేజీ న్యూస్. గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ తాజాగా కాస్త గ్యాప్ తీసుకొని పెండింగులో ఉన్న 3 సినిమాలు స్టార్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ఓ రకంగా పవన్ ఫ్యాక్స్ కి కిక్కిచ్చే న్యూస్ అని చెప్పుకోవచ్చు.

అందులో పవన్ చేయబోయే 2 సినిమాలు అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. వీటిలో ‘హరిహర వీరమల్లు’ ఒకరి. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పునఃప్రారంభమైంది. ఈ క్రమంలోనే మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పీరియాడికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తరువాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న OG సెట్స్ లో అడుగు పెడతారని టాక్ వినబడుతోంది. ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమాకి ఏ ఏం రత్నం నిర్మాతగా వ్యవహరించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాకోసం కీరవాణి ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ రెడీ చేసి, పవన్ కళ్యాణ్‌తో పాడించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అటువంటి పాటలపై ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతాడనే విషయం విదితమే. కాబట్టి ఫ్యాన్స్ ఆయన గొంతు మళ్లీ వినే ఛాన్స్ జనాలకు రాబోతుందన్నమాట. కాగా ‘హరిహర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నారని వినిపిస్తున్న న్యూస్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తోంది, దాంతో అతని సినిమా పై కూడా ఆటోమేటిక్ గా క్రేజ్‌ ఉంటుంది. కాగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: