అవును, మీరు విన్నది నిజమే. ఏ స్థాయి నటుడికైనా మహాకాకపోతే రెండు మూడు డాక్టరేట్లు తన జీవిత కాలంలో వచ్చి ఉంటాయి. కానీ బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ మాత్రం అందరికీ మినహాయింపు అనుకోక తప్పదు. షారుఖ్ గురించి జనాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటుడిగా, నిర్మాత‌గా, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత‌గా షారుఖ్ అందరికీ సుపరిచితుడే. భార‌త‌ దేశంలో 6000 కోట్లు పైగా నిక‌ర ఆస్తులు ఉన్న అతి పెద్ద స్టార్ గా షారూఖ్ కి మంచి గుర్తింపు ఉంది. అయితే ఇది అత‌డిలో ఒక కోణం మాత్ర‌మే. ఇప్పుడు అత‌డిలోని రెండో కోణం గురించి మాట్లాడుకుంటే డాక్టరేట్లు గురించే మాట్లాడుకోవాలి.

అవును, షారూఖ్‌కి మొత్తం అర‌డ‌జ‌నుకి పైగా డాక్ట‌రేట్లు ఉన్నాయ‌న్న‌ సంగతి మీకు తెలుసా? ఇన్ని డాక్టరేట్లు ఉన్నప్ప్పటికీ షారుఖ్ తన పేరు ముందు డాక్టరేట్ అనే పదాన్ని వేసుకోడు. అదే అతనిని మిగతా వాళ్ళనుండి వేరు చేసేలా చేస్తోంది. కళలు, సంస్కృతి, దాతృత్వంలో ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ఏకంగా 3 అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్‌లను పొందాడు షారుఖ్. బాలీవుడ్ కింగ్ ఖాన్ నటన ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే షారుఖ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోలేదు. కెరీర్ ఆరంగేట్రంలో విల‌న్ పాత్ర‌లు చేసాడు. వాటికంటే ముందుగా సీరియల్స్ లో నటించాడు. చిన్న పాత్ర‌ల్లో సినిమాలలో కనబడేవాడు.

నటుడు కావాలనే కోరికతో జమైయా మిలియన్ ఇస్లామియాలో తన మాస్టర్స్‌ను కూడా విడిచి పెట్టాడు. మాస్టర్స్‌ను మధ్యలో విడిచిపెట్టినప్పటికీ విద్య - జ్ఞానం కోసం షారుఖ్ నిరంతరం వెతుకుతూనే ఉంటాడని అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు. షారుఖ్ ఖాన్ పేరు 3 అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్లు ఉన్నాయి. 2009లో షారుఖ్ ఖాన్ యూనివర్శిటీ ఆఫ్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుండి ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో డాక్టరేట్ అందుకున్నాడు. దాంతో పాటు బ్రిటీష్ నైట్‌హుడ్‌తో సమానమైన డాటుక్ అనే మలేషియా బిరుదును పొందిన మొదటి విదేశీ నటుడు షారుఖ్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2015లో అతడు ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ హానోరిస్ కాసాను పొందాడు. అంతే కాకుండా ఏప్రిల్ 2019లో షారూఖ్ ఖాన్ యూనివర్శిటీ ఆఫ్ లా నుండి దాతృత్వంలో డాక్టరేట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: